ఫోటో మూమెంట్: తన బ్యూటిఫుల్ ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్

ఫోటో మూమెంట్: తన బ్యూటిఫుల్ ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్

Published on Jun 23, 2024 4:00 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలు ప్రస్తుతానికి తాత్కాలిక విరామంలో ఉండగా పవన్ తన రాజకీయ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అలా ఈ జూన్ నెల మొత్తంలో కూడా ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ ఇస్తూ అదరగొట్టిన పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని కూడా ప్రపంచానికి మునుపెన్నడూ లేని విధంగా పరిచయం చేశారు.

అలా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ వారసులు కలిసి కనిపించడం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారాయి. ఇక లేటెస్ట్ గా మరో బ్యూటిఫుల్ పిక్ బయటకి వచ్చి వైరల్ గా మారింది. మరి ఈ పిక్ లో పవన్ భార్య అనా లెజినోవాతో పాటుగా పవన్ మాజీ భార్య పిల్లలు అకిరానందన్ అలాగే ఆద్యలు కూడా కలిసి ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. దీనితో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అలాగే ఈ ఊహించని పిక్ ని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు