ఫోటో మూమెంట్ : ‘రెట్రో’ సెట్స్ లో దర్శకునితో పూజా

ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వస్తున్న చిత్రాల్లో తెలుగు ఆడియెన్స్ కూడా మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిలో స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రం “రెట్రో” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని కూడా మంచి గ్యాంగ్ స్టర్ డ్రామాగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించగా నేడు తన బర్త్ డే రావడంతో మేకర్స్ తమ బెస్ట్ విషెస్ ని తెలిపారు.

ఇక లేటెస్ట్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా తన విషెస్ ని కార్తీక్ కి అందించింది. సినిమా పట్ల మీ విజన్, ఫ్యాషన్ నన్నెపుడు ప్రేరేపిస్తుంది అని సూపర్ టాలెంటెడ్ కార్తీక్ సుబ్బరాజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఈ ఏడాది ఒక బ్లాక్ బస్టర్ ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నట్టుగా ఆమె సినిమా సెట్స్ నుంచి ఇద్దరి నడుమ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ పిక్ ని షేర్ చేసుకొని తెలిపింది. దీనితో ఈ పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రం మే 1న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version