ఫోటో మూమెంట్: “కల్కి” సెట్స్ లో నాగ్ అశ్విన్ తో డిస్కషన్ లో ప్రభాస్

ఫోటో మూమెంట్: “కల్కి” సెట్స్ లో నాగ్ అశ్విన్ తో డిస్కషన్ లో ప్రభాస్

Published on Sep 7, 2024 10:21 AM IST

రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో కూడా అదరగొడుతుంది.

అయితే ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు షూట్ మధ్యలో కొన్ని మూమెంట్స్ ని అయితే పలువురు నటీనటులపై షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి కూడా కొన్ని పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. మరి లేటెస్ట్ గా వచ్చిన పిక్స్ లో చూస్తే ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మధ్య ఓ సీరియస్ డిస్కషన్ నే సెట్స్ లో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనితో ఈ పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ భారీ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన తదితరులు నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు