ఫోటో మూమెంట్: రణ్వీర్ తో ప్రశాంత్ వర్మ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఫోటో మూమెంట్: రణ్వీర్ తో ప్రశాంత్ వర్మ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Sep 8, 2024 9:31 PM IST

తాను తీసిన కొన్ని సినిమాలతోనే టాలీవుడ్ లో సత్తా చాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసం తెలిసిందే. ఈ ఏడాదిలో సూపర్ హీరో చిత్రం “హను మాన్” చేసి తాను కూడా పాన్ ఇండియా దర్శకుడు అయ్యాడు. అయితే ఈ చిత్రం తర్వాత తాను మరిన్ని భారీ సినిమాలు చేస్తుండగా వీటిలో ఆ మధ్య భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కూడా ఉంది అని గట్టి వార్తలు వచ్చాయి.

అయితే తమ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందో తర్వాత వెల్లడి చేస్తామని మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ అలాగే రణ్వీర్ లు వైరల్ గా మారారు. ప్రశాంత్ వర్మ రణ్వీర్ తో కలిసి ఎంతో హ్యాపీగా కనిపిస్తున్న పిక్ ఒకటి ఇప్పుడు మంచి మూమెంట్ గా మారింది.

అయితే ఇది సినిమా కోసం కాదు కానీ నేడు రణ్వీర్, తన భార్య స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణ్ లు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులు కావడంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రణ్వీర్ లోని స్పిరిట్, దీపికా లోని గ్రేస్ ఆ చిన్నారికి రావాలని కోరుకుంటూ ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసాడు. దీనితో ఈ పిక్ ఫిష్ రెండూ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు