ఫోటో మూమెంట్: “సరిపోదా శనివారం” ఫ్యామిలీతో ప్రియాంక

రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో చేసిన సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సరిపోదా శనివారం” కూడా ఒకటి. మరి నాని కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా ఇది నిలిచి అదరగొట్టింది. మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా చారూ.. అదే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

నాని, వివేక్ ఆత్రేయ, విలన్ ఎస్ జే సూర్య సహా సినిమాలో కనిపించిన చిన్నారి నటులుతో కలిసి ప్రియాంక పలు ఫోటోలు షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనితో నాని, ప్రియాంక ఫ్యాన్స్ ఈ స్పెషల్ మూమెంట్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version