ఫోటో మూమెంట్ : తలైవర్ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్

ఫోటో మూమెంట్ : తలైవర్ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్

Published on Sep 26, 2023 11:01 AM IST

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ తో చేసిన భారీ హిట్ చిత్రం “జైలర్” సక్సెస్ తో మళ్ళీ రజిని తన ట్రాక్ లోకి వచ్చేసారు. ఇక ఈ సినిమా తర్వాత అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన చంద్రముఖి కి సీక్వెల్ సినిమాతో అయితే టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ బిగ్ స్క్రీన్స్ మీదకి రాబోతున్నాడు. మరి లేటెస్ట్ గా అయితే ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని లారెన్స్ షేర్ చేసుకున్నాడు.

తాను రజినీని కలిసి జైలర్ హిట్ అయ్యినందుకు తన వాత్సల్యాన్ని తెలుపుదామని వెళ్లానని అలాగే నా చంద్రముఖి 2 సినిమా రిలీజ్ కి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నానని రెండు బ్యూటిఫుల్ ఫోటోలు అయితే షేర్ చేసి తాను తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీనితో వారి అభిమానులు ఈ ఫోటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దర్శకుడు వాసు తెరకెక్కించిన చంద్రముఖి 2 లో కంగనా రనౌత్ నటించగా ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు