ఫోటో మూమెంట్: రామ్ చరణ్, ఉపాసనల కొత్త ఏడాది శుభాకాంక్షలు.!

ఫోటో మూమెంట్: రామ్ చరణ్, ఉపాసనల కొత్త ఏడాది శుభాకాంక్షలు.!

Published on Apr 15, 2025 12:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు పెద్ది సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీతో కూడా తాను మంచి టైం ని స్పెండ్ చేస్తున్నాడు. మరి ఇలా లేటెస్ట్ గా రామ్ చరణ్, తన భార్య ఉపాసన కొణిదెలలు ఈ ఏడాది కొత్త ఏడాదిలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఉపాసన పెట్టిన పోస్ట్ ఒకటి ఇపుడు వైరల్ గా మారింది. ఇందులో ఉపాసన, రామ్ చరణ్ ల జంట ఎంతో అందంగా కనిపిస్తుండగా మరాఠి, తమిళ్, అలాగే బెంగాల్ తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న కొత్త ఏడాదిలు, సంక్రాంతి శుభాకాంక్షలని ఆమె తెలిపింది. దీనితో తమ ఇద్దరు తరపున ఈ స్పెషల్ విషెస్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమాని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు