ఫోటో మూమెంట్: కోలుకుంటున్న రవితేజ.. తన డైరెక్టర్ తో ‘పవర్’ ఫ్రేమ్

ఫోటో మూమెంట్: కోలుకుంటున్న రవితేజ.. తన డైరెక్టర్ తో ‘పవర్’ ఫ్రేమ్

Published on Sep 12, 2024 3:07 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి సీనియర్ హీరోస్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్” థియేటర్స్ నుంచి ఇపుడు ఓటిటిలోకి కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా తర్వాత ఊహించని విధంగా రవితేజకి చిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

దీనితో అప్పుడు కొంచెం ఆందోళనకి లోనైన అభిమానుల కోసం రవితేజ స్వయంగా ట్వీట్ చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా రవితేజ బయటకి కనిపించిన విజువల్స్ వైరల్ గా మారాయి. రవితేజ పరిచయం చేసిన ఎందరో దర్శకుల్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యలతో చిత్రాలు చేసే రేంజ్ కి వచ్చిన కొల్లి బాబీ కూడా ఒకరు.

మరి బాబీ ఇండస్ట్రీ లోకి వచ్చి 10 ఏళ్ళు అయ్యిన సందర్భంగా రవితేజ మీట్ అయ్యిన ‘పవర్’ఫుల్ ఫ్రేమ్ వైరల్ గా మారింది. మరి ఇందులో రవితేజ చేతికి కట్టు కనిపిస్తుండగా యాక్సిడెంట్ తర్వాత బయటకి వచ్చారు అంటే నెమ్మదిగా తాను కోలుకుంటున్నారని చెప్పాలి. దీనితో రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు