ఫోటో మూమెంట్: తన పోర్షే కార్ తో థలా


కోలీవుడ్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ లో ఒకరైన థలా అజిత్ కుమార్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “విడా ముయార్చి”, “గుడ్ బ్యాడ్ అగ్లీ” రెండు సినిమాలు అజిత్ చేస్తుండగా ఈ రెండిటిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అజిత్ ఆటో మొబైల్స్ విషయంలో మంచి ఫ్రీక్ అని చాలా మందికి తెలుసు.

కార్లు అలాగే మంచి స్పోర్ట్స్ బైకులు పట్ల అజిత్ కి చాలా మక్కువ ఎక్కువ అలానే వాటితో తాను బయట చేసే పలు సాహసాలు కూడా ఆడియెన్స్ ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే లేటెస్ట్ గా అజిత్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ బ్రాండ్ పోర్షే కారుని కొనుగోలు చేసాడు.

వైట్ కలర్ లో ఈ కారు అదిరిపోగా దానితో అజిత్ సునామిక్ విజువల్స్ ఫ్యాన్స్ లో అలాగే కోలీవుడ్ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. మరి రీసెంట్ గానే దళపతి విజయ్ నటించిన “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” సినిమాలో థలా రిఫరెన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దానికి తమిళ ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

Exit mobile version