ఫోటో మూమెంట్: యువ జంట కీర్తి సురేష్, ఆంటోనీతో దళపతి విజయ్

ఫోటో మూమెంట్: యువ జంట కీర్తి సురేష్, ఆంటోనీతో దళపతి విజయ్

Published on Dec 19, 2024 7:04 AM IST

రీసెంట్ గానే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన పెళ్ళి చేసేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తట్టిని మొన్న గోవాలో హిందూ సంప్రదాయం లోనూ అలావే క్రిస్టియన్ మత తరహా పెళ్లి కూడా ఆమె చేసుకుంది. దీనితో ఆ పెళ్లిళ్ల తాలూకా హ్యాపీ మూమెంట్స్ కూడ వైరల్ అయ్యాయి.

అయితే ఈ పెళ్లికి పలువురు స్టార్స్ కూడా హాజరు కాగా వారిలో కీర్తి సురేష్ కో స్టార్ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా హాజరయ్యారు. మరి లేటెస్ట్ గా కీర్తి సురేష్ ఆ ఫొటోస్ ని షేర్ చేసుకుంది. విజయ్ ఈ యువ జంటతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని అలాగే ఆ యువ జంటను ఆశీర్వదిస్తున్న పిక్ ని కీర్తి సురేష్ షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసింది. దీనితో ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం విజయ్ తన కెరీర్ లాస్ట్ అండ్ 69వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు