ఫోటో మూమెంట్: టాలీవుడ్ సరికొత్త ప్రపంచపు దర్శకులు నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ

ప్రస్తుతం మన తెలుగు సినిమా ఏ స్థాయిలో షైన్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. యువ దర్శకులు తమ టాలెంట్ తో అదరగొడుతుండగా వీరిలో లేటెస్ట్ గా అయితే మరో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా చేరాడు. అయితే ఎంటర్టైనింగ్ లోకంలో సినిమాకి ఎలాంటి అవధులు లేవు. మెయిన్ గా ఇందులో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయ్యి మూవీ లవర్స్ కి ఒక సరికొత్త ఫీస్ట్ ని అందించాయి.

అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది మన దేశంలో కూడా మొదలైంది. బాలీవుడ్, కోలీవుడ్ సహా మన తెలుగు సినిమాలో కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయ్యింది. దీనిని యువ దర్శకుడు హను మాన్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేయగా ఇప్పుడు కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ ని పరిచయం చేసి అదరగొట్టాడు.

మరి ఈ ఇద్దరు కలిసిన ఓ పిక్ మంచి స్పెషల్ మూమెంట్ గా నిలిచింది. కల్కి స్పెక్టాక్యులర్ గా ఉందని నాగ్ అశ్విన్ విజన్ కి ఫిదా అయ్యానని ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ వరల్డ్ స్టార్ అంటూ నాగ్ అశ్విన్ తో కలిపి ఉన్న పిక్ ని షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో టాలీవుడ్ నుంచి రెండు సినిమాటిక్ కొత్త ప్రపంచాలని పరిచయం చేస్తూ క్రేజీ ట్రీట్ ని ఇస్తున్న ఈ ఇద్దరు దర్శకుల పిక్ వైరల్ గా మారింది.

Exit mobile version