ఫోటో మూమెంట్: రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న భారీ చిత్ర “పెద్ది” కోసం తెలిసిందే. మరి మొన్న మార్చ్ 27 తన పుట్టినరోజు కానుకగా అనేకమంది సినీ ప్రముఖులు కూడా చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక లేటెస్ట్ గా మెగా ఇంట చరణ్ బర్త్ డే వేడుకలకి సంబంధించి కూల్ వైబ్స్ ఇపుడు బయటకి వచ్చాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పోస్ట్ చేసిన పిక్స్ అండ్ పోస్ట్ మంచి వైరల్ గా మారాయి.

తనకి ఈ మార్చ్ 27 ఎంతో మెమొరబుల్ గా నిలిచింది అని ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక షేర్ చేసిన పిక్స్ లో అయితే రామ్ చరణ్ చిరంజీవి అలానే సురేఖ ఇంకా చరణ్ సోదరితో కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడమే కాకుండా వారితో పాటుగా అక్కినేని నాగార్జున సహా చిరు ఫ్రెండ్స్ తో కలిసి చరణ్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసిన వైబ్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version