ఫోటో మూమెంట్..స్టన్నింగ్ మేకోవర్ లో విజయ్ దేవరకొండ.!

Published on Sep 15, 2021 3:00 pm IST


మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవకొండ ప్రస్తుతం మాస్ యాటిట్యూడ్ సినిమాల స్పెషలిస్ట్ పూరి జగన్నాథ్ తో ఒక సాలిడ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా “లైగర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడు.

ఓ పక్క బాక్సింగ్ మెళుకువలతో పాటుగా సరికొత్త మేకోవర్ లోకి కూడా మారాడు. అయితే ఈ సినిమాని నిర్మాతలలో ఒకరైన ఛార్మి ఇప్పుడు ఒక స్టన్నింగ్ ఫోటోని షేర్ చేసింది.. లైగర్ సెట్స్ నుంచే విజయ్ ది ఈ ఫోటో. సినిమాలోని సాలిడ్ బాక్సింగ్ సీక్వెన్స్ లో ఆ స్టేజ్ నెట్ కి ఆనుకొని విజయ్ ఇందులో కనిపిస్తున్నాడు.

అంతే కాకుండా తన హెయిర్ స్టైల్ కూడా ఊహించని విధంగా సెట్ చేసినట్టు ఉన్నాడు. పూరి. మొత్తానికి మాత్రం ఈ సినిమాలో కొత్త విజయ్ ని చూడటం గ్యారంటీ అని ఫిక్స్ అయ్యిపోయింది. ఈరోజు నుంచే ఈ సినిమా షూట్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యినట్టుగా ఛార్మి కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా కారం జోహార్ కూడా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :