పిక్ ఆఫ్ ది డే: మెగాస్టార్ తో ఐకాన్ స్టార్ దంపతులు..

లేటెస్ట్ గా మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి హై టెన్షన్ నడిచిందో అందరికీ తెలిసిందే. ఓ పక్క తన పుష్ప 2 రిలీజ్ సక్సెస్ ఇంకో పక్క ఆ సినిమా మూలాన ఓ కుటుంబంలో తీరని నష్టం ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వంటివి ఓ రేంజ్ హంగామా నడిచింది. దీనితో అల్లు అర్జున్ ని అరెస్ట్ తర్వాత విడుదలలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు అని టాక్ సినీ వర్గాల్లో ఉంది.

మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కోసం అనేకమంది సినీ ప్రముఖులు కలిసి తమ సంఘీభావం వ్యక్తం చేస్తే బన్నీ మెగాస్టార్ ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లిన వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ కలయికలో చిరు సహా అర్జున్ కుటుంబం కలిసి లంచ్ కూడా చేశారు. ఈ తర్వాత అల్లు అర్జున్, తన భార్య అల్లు స్నేహ మరియు చిరంజీవి కలిసి ఉన్న పిక్ మెగా అభిమానుల కళ్ళలో ఆనందం నిలిపింది. అలాగే ఈ రోజుకి పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది అని చెప్పాలి.

Exit mobile version