జూనియర్ ఎన్టీఆర్ దేవర: పార్ట్ 1 ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. ఐతే, దేవర ట్రైలర్ లాంచ్‌కు ముందు, ఎన్టీఆర్.. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సమావేశమవ్వడంతో ఈ వార్త వైరల్ గా మారింది. తారక్ – సందీప్ రెడ్డి చర్చకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఫోటో చూసిన వారు, వారిద్దరూ కొత్త ప్రాజెక్ట్ కోసం కలిశారని చెబుతున్నారు.
ఐతే, ఈ ఇద్దరి సమావేశం జస్ట్ సాధారణం అని, వీరు కలిసి ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశం లేదని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. దేవర చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ మరియు మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.