పిక్ టాక్: ఎవరీ కుర్రాడు.. స్మార్ట్ లుక్స్ లో అదరగొట్టేసిన చిరు..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇది చిరు నుంచి స్ట్రైట్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నుంచి ఇపుడు క్రేజీ లైనప్ కూడా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అయితే మెగా ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఉండబోతుంది అని ఇపుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది.

ఇక ఇలాంటి హై మూమెంట్స్ నడుమ మెగా ఫ్యాన్స్ కి చిరు మరో ట్రీట్ ని కూడా అందించారు అని చెప్పాలి. తన నుంచి ఇపుడు కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి. మరి వీటిలో చిరు అయితే సూపర్ స్మార్ట్ లుక్స్ లో కనిపిస్తుండగా సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే తన యంగ్ లుక్స్ చూసి ఎవరీ కొత్త కుర్రాడు అంటున్నారు. దీనితో తన కొత్త లుక్స్ మాత్రం ఇపుడు మంచి వైరల్ గా మారాయి.

Exit mobile version