పిక్ టాక్: కిల్లింగ్ లుక్స్ లో అదరగొట్టేసిన చిరు, నాగార్జున


మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని నాగార్జునలు రియల్ లైఫ్ లో ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది చాలా మందికి తెలుసు. మరి ఇపుడు ఈ ఇద్దరు కూడా తమ భారీ సినిమాల్లో బిజీగా ఉండగా రీసెంట్ గా దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డ్స్ వేడుకని కింగ్ నాగ్ అట్టహాసంగా చేసేందుకు సిద్ధం అయ్యారు.

మరి ఈ వేడుకకి గాను తన ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవిని కూడా ముఖ్య అతిధిగా పిలుస్తాను అని కూడా తెలిపారు. మరి అన్నట్టే నేడు చిరంజీవిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఈ కలయికపై కొన్ని పిక్స్ అయితే క్రేజీగా మారాయి. ఇద్దరికిద్దరు కూడా ఒక ఊహించని స్టైలిష్ లుకింగ్ లో అదరగొట్టేసారు.

కింగ్ నాగ్ ఎప్పటిలానే మంచి స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తుండగా తనతో పాటుగా స్టైలిష్ టి షర్ట్ అండ్ జీన్స్ కాస్ట్యూమ్ లో చిరు కనిపించి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించారు. ఇలా ఇద్దరు కూడా కిల్లింగ్ లుక్స్ తో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కి నేడు ఊహించని ట్రీట్ ని అందించారని చెప్పాలి.

Exit mobile version