సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది – ప్రధాని మోదీ

Published on Dec 1, 2021 12:00 am IST


సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ కూడా సిరివెన్నెల మృతికి సంతాపాన్ని తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు.

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించిందని, ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఆయన ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని రాసుకొచ్చారు.

సంబంధిత సమాచారం :