వైరల్ : మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ‘పోకిరి’ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్

Published on Aug 11, 2022 8:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో 2006లో తెరకెక్కిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి. అప్పట్లో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన పోకిరి, విడుదల తరువాత అన్ని అంచనాలకు మించేలా అత్యధిక స్థాయి విజయం అందుకోవడంతో పాటు హీరోగా మహేష్ బాబుకి సూపర్ స్టార్ స్టేటస్ ని అలానే దర్శకుడిగా పూరి జగన్నాథ్ ని భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది.

ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వైష్ణో అకాడెమి, ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థలపై పూరి, ఘట్టమనేని మంజుల నిర్మించారు. రిలీజ్ అయి 16 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా పోకిరి లోని సూపర్ స్టార్ స్వాగ్, డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్,బీజీఎమ్, పూరి పవర్ఫుల్ టేకింగ్ ని సూపర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేరు.

ఇక ఈ మూవీ యొక్క 4కె వర్షన్ ని మొన్న ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 375 కి పైగా స్పెషల్ షోలు వేశారు .కాగా ఈ షోలకు అన్ని ప్రాంతాల ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ రావడంతో పాటు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1.73 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. యావత్ ఇండియా వ్యాప్తంగా ఒక మూవీ యొక్క రీ రిలీజ్ స్పెషల్ షోస్ ఇంత గొప్పగా కలెక్షన్ రావడం నిజంగా పెద్ద సెన్సేషన్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :