సాలిడ్ స్టార్ట్ తో “పొలిమేర 2”, “కీడా కోలా”.!

సాలిడ్ స్టార్ట్ తో “పొలిమేర 2”, “కీడా కోలా”.!

Published on Nov 4, 2023 8:01 AM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన సరికొత్త చిత్రాల్లో బాగా నోటెడ్ గా వచ్చిన చిత్రాలు అయితే రెండు ఉన్నాయి. మరి ఒకటి ఓటిటి లో సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రం “మా ఊరి పొలిమేర” కి అవైటెడ్ సీక్వెల్ “పొలిమేర 2” ఒకటి కాగా తన బ్రాండింగ్ తోనే మంచి హైలైట్ అయ్యిన చిత్రం తరుణ్ భాస్కర్ “కీడా కోలా” లు అని చెప్పాలి.

మరి ఈ చిత్రాలు కూడా మంచి బజ్ నడుమ రిలీజ్ కి రాగా ఈ చిత్రం ఈ రెండు చిత్రాలు కూడా తెలుగు స్టేట్స్ లో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ స్టార్ట్ తో మొదలైనట్టుగా తెలుస్తుంది. మరి కీడా కోలా కి గట్టి ప్రమోషన్స్ బాగా ప్లస్ కావడంతో మొదటి నుంచి కూడా బుకింగ్స్ స్ట్రాంగ్ గా నమోదు అయ్యాయి.

మరి పొలిమేర 2 కి ఆల్రెడీ ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుండగా రిలీజ్ అయ్యాక టాక్ కూడా సూపర్ పాజిటివ్ గా రావడంతో అయితే సాయంత్రం నుంచి ఈ సినిమా బుకింగ్స్ మాస్ జంప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ రెండు సినిమాలు మాత్రం మంచి ఓపెనింగ్స్ ని నమోదు చేసినట్టుగా టాక్. మరి అఫీషియల్ నంబర్స్ ఏమన్నా వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు