“పొలిమేర 2” కి ఓటిటి లో సూపర్ రెస్పాన్స్!


సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మా ఊరి పొలిమేర 2. ఈ చిత్రం 2021 లో రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర కి సీక్వెల్. పొలిమేర 2 థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇటీవల తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం అయిన ఆహా వీడియో లోకి వచ్చింది.

ఈ చిత్రం కి ఓటిటి లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌర్ కృష్ణ నిర్మించిన ఈ చిత్రం కి గ్యాని సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version