టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “పొలిమేర 2”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “పొలిమేర 2”

Published on Jun 16, 2024 10:32 PM IST

మా ఊరి పొలిమేర చిత్రం ఓటిటిలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కి వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ మా ఊరి పొలిమేర 2 చిత్రాన్ని తెరకెక్కించి, థియేటర్ల లో విడుదల చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, దేవియాని శర్మ, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానెల్ లో వచ్చే వారం సాయంత్రం 6:30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు. గ్యాని సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. బాలాదిత్య, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి మరియు సాహితీ దాసరి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు