సమీక్ష : పొన్నియిన్ సెల్వన్ 2 – పర్వాలేదనిపించే హిస్టారికల్ డ్రామా

Ponniyin Selvan 2 Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, ఆర్. పార్తిబన్

దర్శకులు : మణిరత్నం

నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ అల్లి రాజా

సంగీత దర్శకులు: ఏ. ఆర్. రెహమాన్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

పొన్నియిన్ సెల్వన్ చిత్రం తో ప్రేక్షకులకి చోళ రాజ వంశం గురించి పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 తో అలరించడానికి సిద్దం అయ్యారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ:

 

ఆదిత్య కరికాలన్ (విక్రమ్) మరియు నందిని (ఐశ్వర్య రాయ్ బచ్చన్) ల తొలిప్రేమ సన్నివేశాలతో సినిమా మొదలు అవుతుంది. వారు విడిపోయిన తీరు మిస్టరీ గా ఉంటుంది. చిరు వాయిస్ ఓవర్ తో పార్ట్ 1 ను వివరించడం జరిగింది. అయితే చోళ రాజ్య సింహాసనం కోసం నందిని (ఐశ్వర్య రాయ్ బచ్చన్) ఎలాంటి రాజకీయాలు చేస్తుంది? చోళ రాజ వంశానికి చెందిన సుందర చోళన్ (ప్రకాష్ రాజ్), పోన్నియిన్ సెల్వన్, అరుణ్ మౌళి అయిన (జయం రవి), ఆదిత్య కరికాలన్ (విక్రమ్) లని చంపడానికి ప్లాన్ వేసింది ఎవరు? పొన్నియిన్ సెల్వన్ ను కాపాడిన ఆ మరొక ఐశ్వర్య రాయ్ ఎవరు? చోళులు మళ్ళీ తమ శత్రువుల పై విజయం సాధించారా? కరికాలన్ (విక్రమ్) తన ప్రేమ కోసం ఏం చేశాడు? నందిని (ఐశ్వర్య రాయ్) తన పగను సాధించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

పాన్నియిన్ సెల్వన్ మొదటి భాగంలో సస్పెన్స్ గా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు మణిరత్నం కాస్త డిటైల్డ్ గా నరేషన్ ఇచ్చే ప్రయత్నం చేసారు. అలాగే నిజ జీవితంలో ఉన్న ఇంత పెద్ద చరిత్రను రెండు భాగాలుగా మలచి తనదైన టేకింగ్ తో మణిరత్నం ఫస్ట్ పార్ట్ కంటే కొంచెం మెరుగ్గా అర్థవంతంగా తీశారు.

ఇక ఈ సినిమాలో కూడా ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ పార్ట్ లో మంచి స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న కార్తి విక్రమ్, ఐశ్వర్య రాయ్ పాత్రలకు ధీటుగా స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడం విశేషం. అలాగే తన కామెడీ తో పాటుగా, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా చేశాడు. ప్రేక్షకులను ఇవి బాగా ఆకట్టుకుంటాయి. ఇక ప్రకాష్ రాజ్ కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో మెయిన్ గా విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ల ట్రాక్ పై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసందే. మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అలాగే వీటికి రిలేటెడ్ గానే చాలా సన్నివేశాలు ఉన్నాయి వీటిని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. డైరెక్టర్ వీటిని బాగా చూపించారు. అంతేకాక ఐశ్వర్య రాయ్ రెండు షేడ్స్ లో చేసిన నటన అద్భుతంగా అనిపిస్తుంది. మిగతా నటీనటుల నటన బాగుంది. రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి.

ఇక ఈ తరహా భారీ పీరియాడిక్ సినిమాలకు విజువల్స్ చాలా ముఖ్యం పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో విజువల్స్ బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ అందించిన రవి వర్మన్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వొచ్చు. అలాగే ఏ. ఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసేలా అనిపిస్తాయి..

 

మైనస్ పాయింట్స్:

 

ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి అని చెప్పాలి. ఇదే ఇష్యూ ఫస్ట్ పార్ట్ లో కూడా కనిపిస్తుంది. ఎన్నో కీలక సన్నివేశాలు ఉన్నప్పటికీ, అనవసరమైన సన్నివేశాలు వస్తూ, ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తాయి. చెప్పాలనుకున్న చరిత్ర పెద్దదైనా, కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు బోరింగ్ గా సాగుతాయి.

సినిమాకి కీలకమైన యుద్ద సన్నివేశాలను చూపించిన విధానం ఆకట్టుకోదు. సినిమా అంతా ఎమోషన్స్ తో ఉన్నప్పటికీ, యాక్షన్ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేసిన విధానం ఇంకా కొత్తగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు. చాలా వరకు రెగ్యులర్ సినిమాల్లో లాగా చుట్టేసినట్లు అనిపిస్తాయి.

సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం తో, కనీసం ఆకట్టుకొనే కథనం ఉంటుంది అని ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అది పూర్తి స్థాయిలో ఉండదు. సినిమా లో బలం గా చూపించాల్సిన పాయింట్ ను చెప్పినప్పటికీ, అదే ఫీల్ ను హ్యాండిల్ చేయలేక పోయారు డైరెక్టర్ ఇది మరో ప్రధాన మైనస్ అని చెప్పక తప్పదు.

 

సాంకేతిక విభాగం:

 

డైరెక్టర్ తను చెప్పాలనుకున్న చరిత్రను చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. నటీనటుల నుండి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే గొప్ప చరిత్రను చెప్పేటప్పుడు అంతే గొప్ప స్థాయిలో ప్రధాన పాత్రలను మరింత బలంగా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అది చూపించడం లో డైరెక్టర్ పని తీరు ఆకట్టుకోలేకపోయారని చెప్పక తప్పదు.

మెయిన్ గా కథనం నెమ్మదిగా నడపడం అనేది అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇక పైన మెన్షన్ చేసినట్టుగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే..”పొన్నియిన్ సెల్వన్ 2″ పార్ట్ 1 కి ఒక డీసెంట్ సీక్వెల్ లా ఉంటుంది అని చెప్పొచ్చు. కథకి తగ్గట్టుగా సినిమాలో నడిచే డీసెంట్ డ్రామా, మెయిన్ లీడ్ తాలూకా సాలిడ్ పెర్ఫామెన్స్ లు బాగుంటాయి. కాకపోతే కాస్త స్లోగా సాగే నరేషన్ మాత్రం ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వారాంతానికి ఒక్కసారి ఈ పీరియాడిక్ డ్రామాని చూడవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version