ఓటిటిలో వచ్చేసిన “పొన్నియిన్ సెల్వన్”..కానీ.!

ఈ ఏడాది తమిళ సినిమా నుంచి భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయ్యిన చిత్రాల్లో తమిళ సినిమా ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” కూడా ఒకటి. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ కాస్ట్ తో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ హిస్టారికల్ చిత్రం తమిళ్ వెర్షన్ వరకు సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి ఇప్పటికి కూడా తమిళ్ లో బాగానే రన్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే రెంటల్ రూపంలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు చూడాలి అనుకుంటే ప్రైమ్ మెంబర్స్ అయినా కూడా అదనంగా 200 చెల్లించి చూడాల్సిందే. లేదా మరికొన్ని రోజులు ఉంటే వారికి ఫ్రీ గా స్ట్రీమింగ్ కి ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version