“పొన్నియిన్ సెల్వన్” అఫీషియల్ రన్ టైం వచ్చేసింది.!

“పొన్నియిన్ సెల్వన్” అఫీషియల్ రన్ టైం వచ్చేసింది.!

Published on Sep 24, 2022 9:00 AM IST

ప్రస్తుతం తమిళ్ సినిమా నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా “పొన్నియిన్ సెల్వన్ 1” కూడా ఒకటి. చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ తదితర ఎందరో స్టార్ నటులు నటించిన ఈ చిత్రాన్ని ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి ఈ చిత్రాన్ని ఎట్టకేలకి రిలీజ్ కి తీసుకొస్తుండగా భారీ ప్రమోషన్స్ లో కూడా వారు బిజీగా ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి భాగం రన్ టైం పై అయితే అధికారిక రన్ టైం ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రం టోటల్ 167 నిమిషాల నిడివి వచ్చిందట. అంటే టోటల్ గా 2 గంటల 47 నిమిషాలు ఈ చిత్రం భారీ ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు