మరొక బడా మూవీ ఆఫర్ అందుకున్న పూజా…?

మరొక బడా మూవీ ఆఫర్ అందుకున్న పూజా…?

Published on Jul 6, 2022 10:30 PM IST

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో మంచి క్రేజ్ తో దూసుకెళుతున్నారు పూజా హెగ్డే. తొలిసారిగా నాగచైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఒక లైలా కోసం మూవీ ద్వారా తెలుగు చిత్రసీమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు పూజా. ఆ మూవీ ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల మహేష్ తో మహర్షి, అల్లు అర్జున్ తో డీజే, అలవైకుంఠపురములో, ప్రభాస్ తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తన ఖాతాలో వేసుకున్నారు పూజా హెగ్డే.

ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాలి, రణవీర్ సింగ్ తో సర్కస్ బాలీవుడ్ మూవీస్ చేస్తున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన మూవీ, త్వరలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందనున్న SSMB 28 మూవీస్ లో కూడా నటించనున్న పూజా లేటెస్ట్ గా మరొక బడా మూవీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సూర్య హీరోగా తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎన్నికైనట్టు తెలుస్తోంది. గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు