పూజా హెగ్డే రెమ్యునరేషన్ వింటే కళ్ళు తిరుగుతాయ్

Published on Apr 9, 2021 3:30 am IST

ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం పూజాకు ఏకంగా 3 కోట్ల రూపాయల పారితోషకం ఇస్తున్నారట నిర్మాతలు. పూజా ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకిగా కొనసాగుతోంది. టాప్ హీరోలతో సినిమాలు చేస్తోంది.

రామ్ చరణ్ సరసన ‘ఆచార్య’లో, ప్రభాస్ జోడీగా ‘రాధేశ్యామ్’ చేస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో కూడ ఆమెనే కథానాయకిగా తీసుకున్నారు. ప్రేక్షకుల్లో ఆమెకున్న ఈ ఆదరణ చూసే ఆమెకు మూడు కోట్ల పెద్ద మొత్తం చెల్లించి ఉంటారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. పూజా కెరీర్లో ఇదే భారీ రెమ్యునరేషన్. తమిళంలో పూజాకు ఇది రెండవ సినిమానే. మొదటి సినిమా ‘మూగమూడి’ పెద్దగా సక్సెస్ కాలేదు కూడ. అయినా పూజాకు ఈ బంపర్ ఆఫర్ తగిలింది. ఇప్పుడు చేస్తున్న చిత్రాలు గనుక విజయం సాధిస్తే పూజా రెమ్యునరేష్ ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత సమాచారం :