టాలీవుడ్‌లో బుట్టబొమ్మ ముద్ర వేసుకుని స్టార్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డే ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది. అయితే, సరైన కథ కోసమే ఆమె ఈ బ్రేక్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె తిరిగి ఓ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల హార్రర్ చిత్రాలకు హీరోయిన్లు ఠక్కున ఓకే చెప్పేస్తున్నారు. హార్రర్ జోనర్ సినిమాలు మినిమం గ్యారెంటీగా నిలవడమే గాక.. కథ బాగుంటే మంచి హిట్‌లుగా కూడా నిలుస్తున్నాయి. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్‌గా బాలీవుడ్‌లో వచ్చిన ‘స్త్రీ-2’ నిలిచింది. ఇక దక్షిణాదిన ‘కాంచన’ లాంటి హార్రర్ సిరీస్ సినిమాలకు ఎలాంటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాఘవ లారెన్స్ మరోసారి ‘కాంచన-4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.
ఈ సినిమాలో నటించేందుకు పూజా హెగ్డేను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అసలే మంచి క్రేజ్ ఉన్న సీక్వెన్స్ మూవీ.. అందులో నటిస్తే ఖచ్చితంగా మంచి కమ్ బ్యాక్ ఇవ్వొచ్చని పూజా భావిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.