“రాధే శ్యామ్” సెట్లో రెండు బర్త్ డేలు అంటున్న పూజా.!

Published on Sep 24, 2020 3:38 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్” కూడా ఒకటి. ఈ మూడు చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం షూటింగ్ వచ్చే అక్టోబర్ నెలలో పునః ప్రారంభం కానుంది అని దర్శకుడు రాధా కృష్ణ గత ఆగష్టు నెలలో తెలిపిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ ట్వీట్ కు పూజా ఇపుడు బదులిస్తూ మళ్ళీ షూటింగ్ కోసం చాలా ఎదురు చూస్తున్నానని అదే సెట్ లో రెండు పుట్టినరోజులు ఉన్నాయని రిప్లై ఇచ్చింది.

ఇంతకీ ఆ రెండు పుట్టినరోజు మరెవరివో కూడా ప్రభాస్ అండ్ పూజలవే.. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న కాగా పూజా పుట్టినరోజు ఓ 10 రోజుల ముందే అక్టోబర్ 13న జరుపుకోనుంది. సో ఈ ఇద్దరు తమ పుట్టినరోజులు రాధే శ్యామ్ సెట్ లోనే జరుపుకోనున్నారు. అందుకు పూజా అలా రిప్లై ఇచ్చింది.

సంబంధిత సమాచారం :

More