పూజా హెగ్డే రోల్ అదేనట ?

Published on Jul 12, 2020 2:06 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాబోతున్న
రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉంటుందట. ఇప్పటికే ఆమె లుక్ పై చాల రూమర్స్ వచ్చాయి. అయితే దీని పై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది.

కాగా ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాల కొత్తగా కనిపించనున్నాడట. నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్, రాధేశ్యామ్’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More