హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఐతే, తాజాగా ‘హనుమాన్’ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ విడుదలైంది. ‘పూలమ్మే పిల్ల’ అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ ఇంట్రడక్షన్ చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. అన్నట్టు కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. అలాగే, గౌర హరి ఈ పాటను పాడటంతో పాటు మ్యూజిక్ ను కూడా అందించారు.
కాగా ఈ మూవీ ఇప్పటివరకు రూ.270 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఏది ఏమైనా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘హనుమాన్’ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అటు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ రెస్పాన్స్ దక్కింది. అలాగే, హనుమాన్ సినిమా ప్రేక్షకులనే కాదు, సినిమా వాళ్ళను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే, పలువరు సినీ సెలబ్రిటీలు కూడా హనుమాన్ సినిమాను ప్రశంసిస్తున్నారు.