బిగ్ బాస్ ఆఫర్ కి నో చెప్పిన హీరోయిన్.

Published on Aug 1, 2020 8:11 pm IST

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ బాస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఆకాంక్షను గౌరవిస్తూ స్టార్ మా ఎన్ని అవాంతరాలున్నా, షో నిర్వహణకు రంగం సిద్ధం చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా ఉన్న నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నేటి నుండి ఆయన బిగ్ బాస్ రియాలిటీ షోకి సంబందించిన ప్రోమో షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

ఇక కొన్ని వారాలలో బిగ్ బాస్ షో మొదలుకానుంది. షోలో పాల్గొనే సెలబ్రిటీల ఎంపిక కొనసాగుతుంది. కాగా బిగ్ బాస్ లో పాల్గొనమని హీరోయిన్ పూనమ్ కౌర్ ని స్టార్ మా సభ్యులు సంప్రదించారట. హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించిన పూనమ్, అనేక రకాల కాంట్రవర్సిలలో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఆమె షోలో పాల్గొంటే మంచి ప్రేక్షక ఆదరణ దక్కుతుందని నిర్వాహకులు భావించారట. ఐతే పూనమ్ నో చెప్పినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More