లేటెస్ట్..”లాల్ సింగ్ చడ్డా” కి చాలా తక్కువ ఓపెనింగ్స్.?

Published on Aug 12, 2022 7:04 am IST


బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “లాల్ సింగ్ చడ్డా” కోసం అందరికీ తెలిసిందే. అమీర్ నుంచి అలాగే బాలీవుడ్ నుంచి కూడా మోస్ట్ అవైటెడ్ సినిమా ఇదే. అయితే ఈ సినిమాకి కాంట్రావర్సీలు కూడా ఎక్కువే ఉండడంతో ఈ సినిమాపై ఊహించని నెగిటివిటి తీవ్ర స్థాయిలో వచ్చింది.

ఇక దీనితో తోడు టాక్ కూడా అంత పాజిటివ్ రాకపోవడం ఈ సినిమా వసూళ్లపై బాగా ప్రభావం చూపినట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఓవరాల్ ఇండియా అయితే ఈ సినిమా మొదటి రోజు 11 నుంచి 12 కోట్లు నెట్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనితో అయితే రీసెంట్ టైమ్స్ లోనే కాకుండా అమీర్ కెరీర్ లో కూడా ఇది చాలా తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. మరి ఓవరాల్ వసూళ్ల లెక్కలు అయితే ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :