పూర్ణ ప్రధాన పాత్రలో P19 ట్రాన్సమీడియా స్టూడియోస్ బ్యానర్‌పై పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ “డార్క్ నైట్”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని డబ్బింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య డైరెక్ట్ చేశారు. పూర్ణ సరసన త్రిగుణ్(ఆదిత్ అరుణ్) నటించగా విధార్థ్, సుభాశ్రీ రాయగురు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. “తెలుగులో ఎమోషనల్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘అవును 1’ అండ్ ‘అవును 2’ చిత్రాలలో పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది. ఆ చిత్రాలతోనే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రాలకు అతీతంగా ‘డార్క్ నైట్’లో ఆమె నటన హైలెట్‌గా నిలుస్తుంది. తమిళ్ రచయిత, దర్శకుడు జి.ఆర్.ఆదిత్య ఈ చిత్రాన్ని ఆద్యంతం అధ్బుతంగా ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విధంగా మలిచాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్లింగ్‌గా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో రన్ అవుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది.” అని అన్నారు.
ఈ చిత్రానికి మిస్కిన్ తనదైన సిగ్నేచర్ బీజీఎంతో థ్రిల్లింగ్ విజువల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు.