‘జనతా గ్యారెజ్‌’లో మరో ప్రముఖ నటుడు?

‘జనతా గ్యారెజ్‌’లో మరో ప్రముఖ నటుడు?

Published on May 25, 2016 9:18 AM IST

SACHIN
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారెజ్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో మొదట్నుంచీ ఓ ప్రత్యేకత సంపాదించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోండగా, తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా సినిమా కాస్టింగ్‌లో చేరిపోయినట్లు తెలుస్తోంది. మరాఠీ సినీ పరిశ్రమ ప్రముఖ నటుడు సచిన్ కేడ్కర్ జనతా గ్యారెజ్‍లో విలన్‌గా నటించనున్నట్లు సమాచారం.

జనతా గ్యారెజ్ సినిమాకు బలమైన ఈ విలన్ పాత్రకు కొరటాల శివ సచిన్‌‍ను సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చెప్పారట. ఇక ఈ విషయమై టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొరటాల శివ స్టైల్లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఈ మధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్ అభిమానులను బాగా ఆకర్షించింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న సినిమా ఆగష్టు 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు