పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ‘మాస్టర్’ !

Published on May 31, 2020 11:10 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది. దాంతో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. కాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయట.

దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. కాగా విజయ్ పుట్టినరోజు స్పెషల్‌గా జూన్ 22 న మాస్టర్‌ను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఆగష్టులో విడుదల చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More