‘సిటాడెల్: హనీ-బన్నీ’ ట్రైలర్.. యాక్షన్‌తో కుమ్మేశారుగా!

‘సిటాడెల్: హనీ-బన్నీ’ ట్రైలర్.. యాక్షన్‌తో కుమ్మేశారుగా!

Published on Oct 15, 2024 1:46 PM IST

స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న ప్రెస్టీజియస్ అండ్ క్రేజీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ-బన్నీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ వెబ్ సిరీస్‌ని రాజ్ అండ్ డికె ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇందులో నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దీనికితోడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ వెబ్ సిరీస్ పై హప్ క్రియేట్ అయ్యింది.

ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో నింపేశారు. సమంత ఇందులో చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక ఆమె తనదైన ఈజ్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తన భుజాలపై మోసినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా సమంత క్యారీ చేస్తుంది. మొత్తానికి సమంత ఈసారి యాక్షన్‌తో కుమ్మేసిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్‌లో కేకే మీనన్, సమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. D2R ఫిల్మ్స్, అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ది రసో బ్రదర్స్, రాజ్ అండ్ డికె ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 7 నుంచి ‘సిటాడెల్: హనీ-బన్నీ’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు