“జై భీమ్” నుండి రేపు “పవర్ సాంగ్” విడుదల!

“జై భీమ్” నుండి రేపు “పవర్ సాంగ్” విడుదల!

Published on Oct 17, 2021 6:30 PM IST


సూర్య హీరోగా టి. జే. జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జై భీమ్. ఈ చిత్రం ను సూర్య మరియు జ్యోతిక లు 2D ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సూర్య తో పాటుగా, ప్రకాష్ రాజ్, రజిష విజయన్, లిజోమొల్ జోస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను నవంబర్ 2 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల కు అభిమానులకు అందుబాటులో కి రానుంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు ఇప్పటికే సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కి చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. జై భీమ్ చిత్రం నుండి పవర్ సాంగ్ పాటను రేపు సాయంత్రం ఐదు గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అందుకు సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. సూర్య విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా అలరిస్తున్నారు. ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు