హనుమాన్ నుండి పవర్ ఫుల్ గా “హనుమాన్ చాలీసా”

హనుమాన్ నుండి పవర్ ఫుల్ గా “హనుమాన్ చాలీసా”

Published on Apr 6, 2023 6:01 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నాచురల్ మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న తోలి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ముందుకు ప్రకటించినట్లు గా పవర్ ఫుల్ హనుమాన్ చాలీసా ను విడుదల చేయడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసా నిజం గా చాలా పవర్ ఫుల్ గా ఉంది.

హనుమాన్ ను వీడియో లో చూపించిన తీరు సూపర్ గా ఉంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్,వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరబ్ లు సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు