టాలీవుడ్లో కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇదే జాబితాలో ఇప్పుడు ‘పొట్టేల్’ అనే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది. యువ చంద్రా కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేశాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స తాజాగా రిలీజ్ చేశారు
పక్కా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషన్ రైడ్‌గా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. 1980 కాలం నాటి తెలంగాణలోని పరిస్థితులను మనకు ఈ సినిమాలో చూపెట్టనున్నారు. తన కూతురు చదువు కోసం ఓ తండ్రి ఎదుర్కొనే సమస్యలు.. ఓ పొట్టేలు వారికి ఎలాంటి అడ్డంకులను తెచ్చిపెట్టిందనేది ఈ సినిమా కథగా రాబోతుంది. ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టులు తమలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అటు ఈ ట్రైలర్‌లోని రా అండ్ రస్టిక్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించగా నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అక్టోబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.