లేటెస్ట్ : బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి పవర్ స్టార్ రాక కన్ఫర్మ్ ?


బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ప్రస్తుత క్రేజీ షో అన్ స్టాపబుల్ ఇప్పటికే ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. ఇక ఈ తాజా సీజన్ లో లేటెస్ట్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ కలిసి రావడం, ఇప్పటికే రిలీజ్ అయిన ఆ ఎపిసోడ్ తాలూకు ప్రోమోలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోవడం జరిగింది. కాగా వీరిద్దరి ఎపిసోడ్ డిసెంబర్ 31న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం డిసెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొననున్నట్లు చెప్తున్నారు.

క్రిష్ జాగర్లమూడి తో కలిసి పవర్ స్టార్ రానున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం ఇప్పటికే ఆహా వారు అన్నీ సిద్ధం చేసారని తెలుస్తోంది. మరోవైపు హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాత నాగ వంశీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో 27వ తేదీ కోసం ఆహా చూడండి అంటూ చెప్పడం, అలానే ఆహా వారు కూడా అన్ స్టాపబుల్ షో నెక్స్ట్ గెస్ట్ ఎవరో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేయడం వంటివి చూస్తుంటే పవర్ స్టార్ ఈ షోలో పాల్గొనున్నట్లు చాలా వరకు తెలుస్తోంది. మరి అదే కనుక నిజం అయితే ఎప్పటినుండో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా దీనికి సంబంధించి అతి త్వరలో ఫుల్ డీటెయిల్స్ అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Exit mobile version