ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అదిరిందట

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అదిరిందట

Published on Mar 22, 2020 3:11 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ లుక్ పై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుని ఉన్నారు. తాజాగా ఈ లుక్ గురించి మాట్లాడిన చిత్రంలోని నటుడు ప్రియదర్శి ప్రజెంట్ నడుస్తున్న కరోనా హడావుడి ఒక కొలిక్కి వచ్చాక ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటుందని అన్నారు.

అంతేకాదు లుక్ చాలా బాగుందని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవలే జార్జియాలో చిత్రీకరణ చేసిన టీమ్ సభ్యులంతా స్వీయ గృహ నిర్భందంలో ఉన్నారు. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు