కల్కి: ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రీమ్ – ప్రభాస్

కల్కి: ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రీమ్ – ప్రభాస్

Published on Jun 19, 2024 10:03 PM IST

రెబల్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి2898AD చిత్రం జూన్ 27 వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈరోజు ముంబైలో ఈ చిత్రం కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో ప్రభాస్ మాట్లాడుతూ, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత అశ్వినీ దత్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లకి థాంక్స్ తెలిపారు. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగర సంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలీవబుల్. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు