‘బుజ్జి’ తో ప్రభాస్ పెద్దమ్మ.. విజువల్స్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటించిన లేటెస్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” మ్యానియాతో ఇప్పుడు ఇండియా అంతా ఊగుతుంది. ఇలా ఆఫ్ లైన్ లో థియేటర్స్ దగ్గర అభిమానులు మూవీ లవర్స్ మంచి రచ్చ లేపుతుండగా కొన్ని క్రేజీ విజువల్స్ అయితే సినీ ప్రముఖులు సంబంధించి మరింత కిక్ ఇస్తున్నాయి.

అలా తాజాగా ప్రభాస్ పెద్దమ్మ దివంగత నటులు కృష్ణం రాజు గారి భార్య శ్యామల దేవి గారు లేటెస్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి. సినిమాలో మేకర్స్ చేసిన బుజ్జి కార్ ని ఈరోజు స్పెషల్ గా హైదరాబాద్ ప్రసాద్స్ మల్టిప్లెక్స్ దగ్గర ప్రదర్శనకి ఉంచగా బుజ్జి కార్ లో ఆవిడ ఎక్కినా దృశ్యాలు కొన్ని బయటకి వచ్చి వైరల్ గా మారాయి. దీనితో ఈ విజువల్స్ చూసిన రెబల్ స్టార్ అభిమానులు మంచి ఎమోషనల్ అవుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version