పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్?

Published on Nov 30, 2021 3:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియన్ చిత్రం డిసెంబర్ 17వ తేదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తగ్గేదే లే అన్నట్టుగా ఇప్పటికే ప్రమోషన్స్‌ని జోరుగా చేస్తున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు రెడీ అయినట్టు టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరపబోతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పుష్ప మేకర్స్ ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని ప్రచారం జరుగుతుంది. ‘బాహుబలి’ సిరీస్‌తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఈ ఈవెంట్ కి వస్తే కనుక ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలనుకుంటున్న అల్లు అర్జున్‌కి ఇది నిజంగా కలిసొచ్చే అవకాశమే అవుతుందని చెప్పాలి. అయితే ఈ వేడుక గురుంచి కానీ, ముఖ్య అతిధి గురుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చిత్ర యూనిట్ నుంచి రాలేదు.

సంబంధిత సమాచారం :