“ఆదిపురుష్”కు ప్రభాస్ ఛాయిస్ కూడా అతనే?

Published on Sep 15, 2020 11:40 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూడు భారీ చిత్రాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలానే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అలా ఈ చిత్రానికి ఎంతో కీలకం అయినటువంటి సంగీత దర్శకుని విషయంలో రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది.

ఈ చిత్రానికి ఇద్దరు లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి మరియు ఏ ఆర్ రెహమాన్ ల పేర్లు వినిపిస్తుండగా హీరో ప్రభాస్ కూడా ఈ చిత్రానికి కీరవాణి అయితేనే బాగుంటుంది అని ఓం రౌత్ కు సజెస్ట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఖచ్చితంగా కీరవాణి ఇలాంటి ప్రాజెక్ట్ కు న్యాయం చేయగలరని నమ్మకంతో డార్లింగ్ ఆయన పేరును చెపుతున్నారట. మరి ఓం రౌత్ ఏమనుకుంటున్నారో అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More