వైరల్ : “కల్కి” కోసం డైనమిక్ మేకోవర్ లో ప్రభాస్.!

వైరల్ : “కల్కి” కోసం డైనమిక్ మేకోవర్ లో ప్రభాస్.!

Published on Dec 9, 2023 11:09 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్” రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ హడావుడి పక్కన పెడితే మరోపక్క ప్రభాస్ కెరీర్ లో పాన్ వరల్డ్ సినిమా అయినటువంటి “కల్కి 2898ఎడి” షూట్ లో కూడా తాను పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఆల్రెడీ ప్రభాస్ మేకోవర్ ఏంటి ఎలా ఉండబోతున్నాడు అనేది అందరికీ తెలుసు.

కానీ లేటెస్ట్ గా వచ్చిన ఓ డైనమిక్ మేకోవర్ మాత్రం ప్రభాస్ అదిరిపోయాడు. అని చెప్పాలి. మెయిన్ గా తన గడ్డం షేప్ ని మార్చి కనిపిస్తున్న తాజా లుక్స్ అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారిపోయాయి. దీనితో ఈ సినిమా విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా కల్కి సెట్స్ నుంచి నెట్ ఫ్లిక్స్ సీఈఓ ని కలిసినట్టుగా మేకర్స్ పోస్ట్ చేయగా అందులో లుక్స్ కూడా ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు