అన్‌స్టాపబుల్2: ప్రభాస్ ఎపిసోడ్ సరికొత్త ప్రోమో రిలీజ్!

ప్రేక్షకుల నుండి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్న తర్వాత, అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్2 షో రన్నర్లు ప్రభాస్ ఎపిసోడ్ యొక్క పార్ట్ 2 ప్రోమోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా, ఆహా వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేయడం జరిగింది. బాహుబలి ఎపిసోడ్‌లోని పార్ట్ 2లో మరింత సరదాగా ఉంటుందని చెప్పారు.

జనవరి 6, 2023 న ప్రీమియర్ కానున్న ఈ రాబోయే భాగంలో గోపీచంద్ సలార్ నటుడితో కలిసి వచ్చారు. ప్రభాస్‌ పై హోస్ట్ బాలకృష్ణ చమత్కారమైన పంచ్‌లు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎపిసోడ్ రెండో భాగంపై ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు.

Exit mobile version