Salaar 2: శౌర్యంగ పర్వం నుంచి క్రేజీ లీక్.. ఎగ్జైట్ అవుతున్న రెబల్స్

Salaar 2: శౌర్యంగ పర్వం నుంచి క్రేజీ లీక్.. ఎగ్జైట్ అవుతున్న రెబల్స్

Published on Oct 7, 2024 12:00 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో క్రేజీ సీక్వెల్ సినిమాలు కూడా ఉండగా ఈ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ సీక్వెల్ చిత్రం “సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ చిత్రం షూటింగ్ కొంతమేర ఎప్పుడో ప్రశాంత్ నీల్ పూర్తి చేసాడు.

బ్యాలన్స్ షూట్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉండగా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ లీక్ కోసం ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సలార్ 2 లో టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి ఇది చూసి రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. పార్ట్ 1 లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది ఎంతో వైలెంట్ గా ఉంటుంది అని ఆల్రెడీ టాక్ స్ప్రెడ్ అవుతుంది. మొత్తానికి అయితే ఇది సలార్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు