రెబల్ ఫ్యాన్స్ మాత్రమే ఇలా చేయగలరు…కల్కి చిత్రం కోసం జపాన్ నుండి హైదరాబాద్ కి!


రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న తొలి పాన్ ఇండియా హీరో. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి2898AD చిత్రంలో భైరవ పాత్రలో నటించి, ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ప్రభాస్ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు అని ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు.

కల్కి చిత్రం ను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్ నుండి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ ఫొటోలో శంబాల ప్రాంతంలో వాడిన ఒక ట్రక్ కూడా ఉంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద వారు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి చిత్రంను ఇక్కడ చూసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా రెబల్ స్టార్ ఫ్యాన్స్ చేసిన పనికి ఇతర ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిసలైన రెబల్ స్టార్ రేంజ్ అంటూ ఫీల్ అవుతున్నారు.

ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఫీమేల్ లీడ్ రోల్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు.

Exit mobile version